అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు మాజీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్
డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2024లో జరిగే ఎన్నికల్లో గెలిచి, శ్వేత సౌధంలో
అడుగు పెడతానని, దేశ అస్థిత్వాన్ని కాపాడుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ
సందర్భంగా ఆయన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. దేశ,
విదేశాంగ విధానాల్లో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు.. ప్రపంచం ముందు అమెరికాను
విఫల దేశంగా నిలబెట్టాయని దుయ్యబట్టారు. ‘‘వామపక్ష భావజాలంతో నిండిన బైడెన్
నేతృత్వంలోని తీవ్రవాద డెమొక్రాట్లను మట్టికరిపించి తీరుతా. 2024 ఎన్నికల్లో
బైడెన్ ఇంటికెళ్లక తప్పదు’’ అని 400 మంది తన మద్దతు దారులను ఉద్దేశించి
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ వద్ద 76 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు.
అమెరికాను సమున్నతస్థాయిలో తిరిగి గాడిలో పెట్టేందుకే తాను అధ్యక్ష ఎన్నికల్లో
పోటీ చేయాలనుకున్నట్టు తెలిపారు.