విజయవాడ : ప్రముఖ సాహితీ , సినిమా విమర్శకులు, పుస్తక రచయిత, విశ్లేషకులు
కే.పి. అశోక్ కుమార్ కు “సి.హెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం”
లభించనుంది. నవంబర్ 26, సాయంత్రం 4 గంటలకు, గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో తను రచించిన “విమర్శ వీక్షణం”
పుస్తకావిష్కరణ సభలో, ఈ సాహితీ పురస్కారాన్ని ఆయనకు అందజేయనున్నట్లు ప్రొఫెసర్
సి.హెచ్.సుశీలమ్మ ప్రకటించారు. తన తండ్రి సి.హెచ్.లక్ష్మీనారాయణ పేరిట ప్రతి
ఏటా ఈ సాహితీ పురస్కారాన్ని ఆమె అందజేస్తున్నారు. గతంలో ప్రముఖ విమర్శకులు
డాక్టర్ కడియాల రామ్మోహన్ రాయ్ కు, ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి కి
ప్రదానం చేసినట్లు ఆమె తెలిపారు. కాగా నవంబర్ 26 వ తేదీన జరిగే “విమర్శ
వీక్షణం” గ్రంధావిష్కరణ సభకు ముఖ్య అతిధిగా అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ
బాబు రానున్నట్లు ఆమె తెలిపారు. అవార్డు గ్రహీత కే.పి. అశోక్ కుమార్
‘కధావలోకనం’, ‘తెలుగు నవల- వస్తు వైవిధ్యం’, ‘కధానుశీలనం విమర్శ గ్రంధాలు’,
‘దళితగీతాలు’, ‘ఎనిమిదో అడుగు’, ‘జాంబా పురాణం’, ‘నోబెల్ కవిత్వం’, వెయ్యికి
పైగా హాలీవుడ్, తెలుగు సినిమాల సమీక్షలు, రెండు వేలకు పైగా పుస్తక సమీక్షలు
ఆయన చేశారని ఆమె తెలిపారు. సాహిత్య అభిమానులందరికీ పత్రికా ముఖంగా ఇదే తన
సాదర ఆహ్వానమని ప్రొఫెసర్ సి.హెచ్.సుశీలమ్మ తెలిపారు.