నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఆనాటి శ్రీభాగ్
ఒడంబడికను స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రాన్ని తిరిగి విభజించే పరిస్థితులు
తలెత్తకుండా, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా బుధవారం నెల్లూరు రూరల్
నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుండి వందలాదిమంది నాయకులు,
కార్యకర్తలు, మహిళలతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకుగాను
1937, నవంబర్ 16న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల రాజకీయ నాయకులమధ్య రెండు ప్రాంతాలు
సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, పెద్దమనుషుల సమక్షంలో శ్రీభాగ్ ఒప్పందం
ఈ ఏడాదికి 85ఏళ్ళు పూర్తయ్యినది. అదే స్పూర్తితో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్
మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర
కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం
వలన పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని,
భావితరాల భవిష్యత్తుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
నిర్ణయాన్ని స్వాగతిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున మద్దతు ర్యాలీ
ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, నగర అధ్యక్షులు
తాటి వెంకటేశ్వర రావు, 26 డివిజన్ల కార్పొరేటర్లు, ఏఎంసీ ఛైర్మెన్, కూకటి హరి
బాబు యాదవ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ , వైసీపీ సీనియర్
నాయకులు, మహిళా నాయకురాళ్లు, విద్యార్థి విభాగ నాయకులు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.