రష్యాలో తయారైన రెండు క్షిపణులు తమ దేశంలో పడిపోయాయని పోలాండ్ మంగళవారం
తెలిపింది. దీంతో ఇద్దరు పోలాండ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. G-20 సమావేశం
మధ్య పోలాండ్ ఆరోపణ మూడవ ప్రపంచ యుద్ధం సంభావ్యతను పెంచుతోంది. నాటో
సభ్యత్వం కలిగిన పోలాండ్లోకి క్షిపణులు ప్రయోగం చేశారన్నవాదనలపై
ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు పోలాండ్ ప్రశ్నలకు రష్యా
సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, జి-20 సదస్సులో ఉన్న అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే,
పోలాండ్ చేసిన ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. ఇది కుట్రలో భాగమేనని,
తాము క్షిపణులను ప్రయోగించలేదని స్పష్టం చేసింది.