ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా
అధ్యక్షుడు జిన్పింగ్ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు
లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్ను ఆలింగనం
చేసుకున్న నరేంద్ర మోడీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. యుద్ధం ఆగకుంటే
ప్రపంచం ముందుకు సాగడం కష్టమని, ఇది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చని
జోకో విడోడో ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో వీటిపై చర్చ. కరోనా,
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఐరోపా సంక్షోభం,
ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపైన జి20 దేశాలు చర్చించనున్నాయి.
ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపైన విస్తృతంగా చర్చ జరుగనుంది. ఈ
సవాళ్లను అధిగమించేందుకు లీడర్లు మార్గాలు వెతకనున్నారు.