నరసన్నపేట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 25న జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయన
పర్యటనకు సంబంధించిన సభాస్థలిని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ జిల్లా కలెక్టర్
శ్రీకేష్ లాటకర్, జిల్లా ఎస్పీ రాధిక తో కలిసి నరసన్నపేట నియోజకవర్గంలో
పలుచోట్ల పరిశీలించారు. జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష రెండో విడత
కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం
జిల్లా ముఖ్య యంత్రాంగం తో ఏర్పాట్లపై చర్చించారు. నరసన్నపేట కాలేజీ గ్రౌండ్,
తామరపల్లి, గుండు విల్లి పేట, ఈదుల వలసలో పలుచోట్ల వివిధ స్థలాలను
పరిశీలించారు. సీఎంఓ కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో
వారితో నరసన్నపేట ఎంపిపి ఆరంగి మురళీధర్, డిసిసిబీ చైర్మన్ కరిమి
రాజేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు చింతు రామారావు, ముద్దాడ భైరాగినాయుడు,
రాజాపు అప్పన్న, తదితరులున్నారు.