విజయవాడ : విప్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని బ్రాహ్మణ వీధి శ్రీవేంకటేశ్వర
స్వామి వారి ఆలయం దగ్గర మంగళవారం నిర్వహించిన అమృత్ భారత్ రథయాత్రకు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. అరుణాచల్
ప్రదేశ్‌లోని పరశురామ కుండ్‌కు తీర్థయాత్రను ప్రోత్సహించడానికి విప్రా
ఫౌండేషన్ అమృత్ భారత్ రథ యాత్రను చేపట్టింది. అక్కడ 51 అడుగుల భారీ
విగ్రహాన్ని స్థాపించడానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరశురాముడు తన
ప్రాయశ్చిత్తం చేసిన పవిత్ర స్థలంలో ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి శుభ
సందర్భంగా గొప్ప జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రథయాత్ర దేశ వ్యాప్తంగా
జరుగుతుండగా ప్రస్తుతం విజయవాడ చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా రథంలో ఏర్పాటు
చేసిన పరశు రాముని ఉత్సవ విగ్రహంకు గవర్నర్ పూజాదికాలు నిర్వహించి,
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, గవర్నర్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.