టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన..
ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్లాల్ అవెన్యూ
రద్దీ మార్కెట్లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే..ఈ ఘటనకు సంబంధించి
అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ
గా ఉండే ఆ వీధిలో ఆ దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు
అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్
సోయ్లూ సోమవారం ధృవీకరించారు. మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం
చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను
ఆదేశించారు. కాగా, 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్లో పేలుడు జరిగి
సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.