అమరావతి : రాష్ట్రంలో ఈనెల 15 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు కుష్టు
వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు
అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వై.యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పల్లెనుండి పట్టణ స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని 21 రోజుల పాటురాష్ట్రంలోని 26
జిల్లా లలో నిర్వహించనున్నామనీ , దీనికి గాను 42,752 మంది ఆశాలు, మేల్
వాలంటీర్ లు బృందాలు గా ఏర్పడి కుటుంబం లోని ప్రతిఒక్కరినీ పరీక్షించి వ్యాధి
ప్రభావం కలిగిన అనుమానితులను గుర్తిస్తారనీ ఆమె పేర్కొన్నారు. గుర్తించిన
వారిని దగ్గరలో ఉన్న ప్రాథమిక లేదా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారని
తెలిపారు. రోజువారీగా 20 నుండి 25 ఇళ్లను టీమ్ లు సందర్శించేలా పర్యవేక్షణకు
గాను 3404 మంది పారా మెడికల్ సిబ్బంది ని ఎంపిక చేశామన్నారు. వ్యాధి ప్రభావం
కలిగిన అనుమానితులను ప్రతి ఒక్కరినీ నిసితంగా పరీక్షించి వ్యాధి నిర్దారణ
కోసం వైద్యాధికారి దగ్గరకు పంపిస్తారని ఆమె వివరించారు. రోజువారీ గా సర్వే
నివేదికల్ని సేకరిస్తామన్నారు. ఈ సర్వేలో టీంల ద్వారా రోజూ 35 లక్షల మందిని
పరీక్షించి, వారిని నుండి కుష్టు వ్యాధి ప్రభావం కలిగిన అనుమానితుల్ని
గుర్తించేలా ప్రణాళిక సిద్దం చేశామని డాక్టర్ యాస్మిన్ తెలిపారు. వ్యాధి
నిర్ధారణ జరిగిన వారికి బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధి రకాన్ని బట్టి అన్ని
ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ
శాఖ
కమీషనర్ పర్యవేక్షణలో సంబంధిత అధికారులు సర్వే కొనసాగుతుందని ఆమె వివరించారు.