అమరావతి : ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖతో కలిసి
పనిచేయడానికి
తాము సిద్ధంగా వున్నామని నాధ్ హెల్త్ సదరన్ చాప్టర్ ప్రతినిధులు సంసిద్ధతను
వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఎపి సచివాలయంలోని తన ఛాంబర్లో వైద్య
ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీఎం.టి. కృష్ణబాబుతో కలిసి చర్చించారు. ఆరోగ్య
పరిరక్షణకు సంబంధించి ఏపి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గల అవకాశాలపై వారు
చర్చించారు. యిందుకు సంబంధించి విజయవాడలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం,
క్యాన్సర్ నివారణకు సమగ్ర ప్రణాళికకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, క్యాన్సర్ కు
సంబంధించి ముందస్తు సమగ్ర డయగ్నోసిస్, చికిత్సా విధానాన్ని అమలు చేయడం వంటి
అంశాలపై వారి ఆసక్తతను వ్యక్తం చేశారు.
అలాగే ఆరోగ్య రంగంలో డిజిటలైజేషన్ కు సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ దేశంలోనే
ముందు
ఉండడం పట్ల నాధ్ హెల్త్ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసించారు. వైద్య ఆరోగ్య
రంగంలో ప్రయోజనకరమైన ఫలితాలు సాధించే విధంగా ఏమేరకు భాగస్వామ్యాన్ని
ఏర్పరుచుకోవచ్చో
తెలియజెప్పాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జిఎస్ నవీన్ కుమార్ ఈ
సందర్భంగా వారిని
ముఖ్యంగా డిజిటలైజేషన్ ద్వారా మరింత సమర్థ వంతంగా ఆరోగ్య సేవల్ని అందజేయడం,
అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడి) విషయంలో దీర్ఘకాలిక చర్యలు చేపట్టడం వంటి అంశాల
విషయంలో తాము ఆసక్తిని కనబరుస్తున్నట్లు నాధ్ హెల్త్ ప్రతినిధులు తెలిపారు.
వైద్య ఆరోగ్య రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గాను తగిన శిక్షణ యివ్వడం
ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని, అందుకుగాను అధునాతన విధానాలను
అందిపుచ్చుకునే విధంగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని నాధ్ హెల్త్
ప్రతినిధులు తెలిపారు. తిరుపతిలో సంయుక్తంగా రోడ్ షోను నిర్వహించి తద్వారా
అవగాహన కల్పించడం, స్థానికంగా పలు సంస్థలను యిందులో భాగస్వామ్యం చేయడం వంటి
అంశాలపై కూడా వారు చర్చించారు. ఐఐటి, ఐఐఎస్యిఆర్, టిటిడి వంటి సహకారాన్ని కూడా
తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ
జి.ఎస్.నవీన్ కుమార్, నాధ్ హెల్త్ సదరన్ చాప్టర్ ప్రతినిధులు శ్రీకాంత్
శ్రీనివాసన్, మన్ని వాధ్వా, అపోలో హాస్పిటల్స్ ఏపీ, తెలంగాణా సియివో
సుబ్రమణ్యన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.