ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ 8
మిలియన్ల మంది ఫాలోవర్లను దాటింది.ట్విట్టర్లో యోగి ఆఫీస్ ఖాతా ప్రధాని మోదీ
ఆఫీస్ ఖాతా తర్వాత రెండవ అతిపెద్దదిగా నిలిచింది. యూపీ సీఎం యోగికి యాప్లో 60
లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు యాప్లో యోగికి అత్యధికంగా
ఫాలోవర్లు ఉన్నారు.యోగి ఆదిత్యనాథ్ కు సోషల్ మీడియాలో ప్రజాదరణ పెరుగుతోంది.
యోగి సభలకు జనం లక్షలాదిగా తరలివస్తుంటారు. ప్రధాని మోదీ కార్యాలయ ఖాతాకు
అత్యధికంగా 5.14 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్
బఘేల్ ఆఫీస్ ఖాతాలో కేవలం 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒడిశా సీఎం
కార్యాలయానికి 13 లక్షల మంది, తెలంగాణ సీఎంఓకు 14 లక్షలు, తమిళనాడు సీఎంఓకు 18
లక్షలు, రాజస్థాన్ సీఎంకు 19 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎంఓకు 9.5 లక్షల మంది
ఫాలోవర్లు ఉన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గుజరాత్ సీఎంఓ కు 10 లక్షల
మంది, మహారాష్ట్ర సీఎంఓ కు 37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.