ఆంధ్ర ప్రదేశ్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లా లో డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయన్ని
డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో
నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు.
వ్యాయామ శాల పరికరాలను పరిశీలించి స్వయంగా కాసేపు జిమ్ ప్రాక్టీస్ చేశారు.
మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లో పర్యటనలో భాగంగా
శ్రీకాకుళం జిల్లా, పార్వతపురం మన్యం జిల్లాలో గత నాలుగేళ్లుగా నమోదు కాబడిన
వివిధ నేరాలు నమోదు, నేర తరహా విధానం మార్పుపై, నియంత్రణ చర్యలపై సమీక్ష
సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా హత్య ,ఆస్తి తగాదాలు,
రోడ్డు ప్రమాదలు వంటి నేరాలు నమోదు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. హత్యయత్నం,
కొట్లాట, శారీరిక సంబంధమైన నేరాలు కొంతమేరకు పెరిగాయని తెలియజేశారు. మహిళలపై
జరుగు నేరాలు గృహహింసలు, పెరిగినప్పటికీ ప్రజల్లో అవగాహన కలగడం వలన ప్రతి
చిన్న సమస్య పోలీస్ దృష్టికి తీసుకోవడం వల్ల ఆయా కేసులు సంఖ్య పెరిగాయని
పేర్కొన్నారు.
ప్రతి వారం జిల్లా ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులతో
పాటు పోలీస్ స్టేషన్ స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి ఇరు వర్గాల
వారికి స్పందనలు వచ్చే ఫిర్యాదులపై కౌన్సిలింగ్ జరిపించి, ప్రతి పోలీస్
అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి నేర నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన
పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదుల ద్వారా తీవ్రమైన నేరాలు, నాటు
సారా విషయంలో రెండు జిల్లాల్లో నాటు సార తయారి ప్రదేశాలు, గ్రామాలను గుర్తించి
ఆయా గ్రామలలో తరచు నాటుసార కాచే వ్యక్తులను గుర్తించి ప్రత్యేక ఉపాధి అవకాశాలు
కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నాట
సారా క్రయవిక్రయాలు జరిగే గ్రామాలలో, ఉపాది అవకాశాలు, అవగాహన కార్యక్రమాలు,
ఇతరత ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆయా గ్రామాల్లో పాత నేరస్థులకు సుమారు 80
మందిలో గుర్తించి 27 మందికి వివిధ విభాగాలు సహకారంతో ఉపాధి అవకాశాలు కల్పించడం
జరిగిందని డిజిపి తెలియజేశారు.
శ్రీకాకుళం జిల్లా ఒడిస్సా రాష్ట్రం తో సరిహద్దు ఉండటంచే అక్కడక్కడ నాటుసారా,
గంజాయి తయారీ, రవాణా జరుగుతున్నాయని మరికొన్ని నెలల్లో కఠినమైన చర్యలు
చేపట్టి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3400 నాటు నాటు సారా క్రయవిక్రయాలు జరిగే గ్రామాలను
గుర్తించామని, ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి
ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి 220 గ్రామాలుకు తగ్గించడం
జరిగిందని,ఎస్సీ బీసీ కార్పొరేషన్లు డ్వామా, విభాగం ఇతర విభాగల సహకారంతో ఆయా
గ్రామాల్లో ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించి నాటు సార రహిత గ్రామా
తీర్చిదిద్దడం ముఖ్య ద్యేయంగా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. గత
ఏడాదిలో 7500 ఎకరాల గంజాయి సాగును నిర్వర్యం చేసి ఆయా ప్రాంతాల్లో ఇతర సాగు
చేసేందుకు స్థానిక రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. ఇప్పటివరకు
రాష్ట్రవ్యాప్తంగా 169 మంది పీడీ యాక్ట్ నమోదు చేసి ముద్దాయలును అరెస్టు చేసి
అక్రమ రవాణా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతంలో అక్కడక్కడ మావోయిస్టు కదలికలు ఉన్నప్పటికీ
పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.రాష్ట్రంలో పోలీసు
సిబ్బంది కొరత ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిబ్బంది కొరత దృష్ట్యా 6500
మంది సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని డిజిపి తెలిపారు.
పోలీస్ సిబ్బంది హోమ్ గార్డుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని
ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి రవి శంకర్
అయ్యర్,విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరిక్రిష్ణ,శ్రీకాకుళం జిల్లా ఎస్పీ
జి.ఆర్.రాధిక, మన్యం జిల్లా ఎస్పీ వి.విద్యా సాగర్, ఎస్ఈబి ఎస్పీ కె.నాగ
మణికంఠ, అదనపు ఎస్పీలు కె శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వర్, ఓ.దిలీప్ కిరణ్,
ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.