విజయవాడ : ప్రధాని నరేంద్ర మోడీ సిఎం జగన్ విశాఖ బహిరంగ సభకు హాజరైన జన
సముద్రాన్ని చూసి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫిట్స్ వచ్చి
కొట్టుకుంటున్నాడని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు
విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆదివారం
స్పందించారు. తెలుగు దొంగల పార్టీ తుప్పునాయుడు మళ్లీ ఏదో కొత్త కుట్రకు
స్కెచ్ వేశాడని మండిపడ్డారు. బాబు రాజకీయ జీవితం అంతా ఇంతేనని తాను
పరుగెత్తలేడు ముందు ఉరికే వారికి కాళ్లడ్డం పెట్టి పడేయాలని చూస్తాడని ఎద్దేవా
చేశారు. టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
బట్టబయలవుతాడని తెలిపారు.అతను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వైఎస్ఆర్ సిపికి
మెజారిటి పేరుగుతుందని, 2024 ఎపీలో వైఎస్ఆర్ సిపి అఖండ విజయానికి లోకేష్
పాదయాత్ర కారణం కానుందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ సిపికి రాష్ట్ర ప్రయోజనాలు
తప్ప మరోక ఎజెండా లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి స్వార్థ ప్రయోజనాలే
ఉంటాయాని ప్రతి ఎన్నికకు పొత్తుల ఎజెండా మారుతుందని చెప్పారు. విశాఖలో జరిగిన
ప్రధాని సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విభజన హామీలను సహృదయంతో
పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. కేంద్ర
ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమని, తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో
ఎజెండా లేదు.. ఉండబోదని స్పష్టం చేశారని తెలిపారు.