దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో శనివారం స్పల్పంగా భూకంపం సంభవించింది.
ఢిల్లీతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని
నొయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 8
గంటల ప్రాంతంలో భూమి 5 సెకన్లపాటు కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్
స్కేలుపై 5.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. నేపాల్ లో 10 కిమీ లోతున భూకంపం
కేంద్రం ఏర్పడినట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. కాగా, భద్రత
దృష్ట్యా, ఎత్తైన కమ్యూనిటీలలోని అనేక మంది నివాసితులు తమ ఇళ్లను
విడిచిపెట్టారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి.
గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేపాల్ లో 6.3 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో
భూకంపం సంభవించిన సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించిన విషయం తెలిసిందే.
ఇటీవల నేపాల్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పొరుగు దేశంలో ఆరుగురు
మరణించారు. తిరిగి అదే ప్రాంతంలో శనివారం రాత్రి మరోసారి భూకంపం సంభవించింది.
వారం వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. IMD అధికారిక సమాచారం
ప్రకారం, నేపాల్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. ఉత్తరాఖండ్‌లోని
పితోర్‌గఢ్, మున్సియారీ, గంగోలిహట్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
‘భూకంప కేంద్రం నేపాల్‌లోని సిలంగా పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో..10
కి.మీ లోతులో ఏర్పడింది.