డీసీ కామిక్స్‌లో బ్యాట్‌మ్యాన్ పాత్రకు ఉన్న క్రేజే వేరు. నిజానికి ఆ
పాత్రకు ఇచ్చిన వాయిస్‌తోనే ఆ పాత్ర, ఆ సిరీస్ అంత హిట్టయ్యాయి. హాలీవుడ్
చిత్రం బ్యాట్‌మ్యాన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్
కాన్రాయ్(66) కన్నుమూశారు. కొద్ది రోజులుగా పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన
గురువారం తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
పొందుతూ కన్నుమూసినట్లుగా శుక్రవారం వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది.
కెవిన్ కాన్రాయ్ మృతితో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ
ప్రేక్షకులు, ప్రముఖులు కెవిన్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం
చేస్తున్నారు. తన గాత్రంతో ఎంతో మంది సినీప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన
క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం యానిమే టెడ్ సిరీస్ మాత్రమే
కాకుండా అనేక టీవీ షోలు.. చలనచిత్రాలు.. అర్ఖామ్ నైట్.. అర్ఖామ్ సిటీ వంటి
కంప్యూటర్ గేమ్స్ కు ఆయన వాయిస్ అందించారు. వాయిస్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి
చెందినప్పటికీ, కెవిన్ తన కెరీర్‌ను 80లలో లైవ్-యాక్షన్ యాక్టర్‌గా
ప్రారంభించారు. అతని మొదటి ప్రదర్శన సోప్ ఒపెరా అనదర్ వరల్డ్. 1992లో అతను
మొదటిసారిగా బ్యాట్‌మాన్ పాత్రకు వాయిస్ అందించారు. కామిక్స్ పోర్షన్ తర్వాత
1992-96 మధ్య బ్యాట్ మన్ సీరిస్ లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి.
దాదాపు 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్, 20కి పైగా వీడియోగేమ్స్, ఆర్ఖాన్
అండ్ ఇన్ జస్టిస్ ఫ్రాంచై జీలకు ఆయన వాయిస్ అందించారు.