ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించడంపై మంత్రి
బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ రాద్ధాంతం వల్ల గోరంతం ఉపయోగం కూడా
ఉండదని విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రుషికొండలో ప్రభుత్వ
భవనాలు నిర్మిస్తున్నాం. తప్పేంటి? ఇక్కడ గతంలో కూడా భవనాలు ఉన్నాయి. విజయనగరం
గుంకలాం వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్షిప్ నిర్మిస్తున్నాం. గుంకలాంలో
జగనన్న కాలనీ పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుంది’’ అని బొత్స సత్యనారాయణ
తెలిపారు.