విజయవాడ : బీసీ ల నేతాజీ ములాయం సింగ్ యాదవ్ సేవలు దేశ ప్రజలకు ఆదర్శనీయమని
దివంగత మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బి సి నాయకులు ములాయం సింగ్ దేశానికి
చేసిన సేవలు ఆదర్శనీయమని పలువురు నేతలు కొనియాడారు. ఆంద్రప్రదేశ్ లోని పలు బి
సి సంఘాలు నాయకులు ములాయం సింగ్ యాదవ్ బీసీ సామాజిక సేవల గురించి కొనియాడారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్యే కళాక్షేత్రంలో శనివారం దివంగత ములాయం
సింగ్ యాదవ్ సంస్మరణ సభను నిర్వహించారు.
మధు బొట్టా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యకమానికి సీనియర్ పాత్రికేయులు మరసాని
శ్రీనివాసరావు సభాధ్యక్షునిగా వ్యవహరించారు. మారుమూల ప్రాంతంలో ఓ కుగ్రామంలో
నిరుపేద కుటుంబంలో జన్మించిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా,
కేంద్ర రక్షణ శాఖ మంత్రి గా దేశ భద్రతకు ఎంతో కీలకమైన పాత్ర వహించారని, బీసీ
సామాజిక వర్గాలకు, దేశ ప్రజలకు ఎంతో సేవలు అందించారని వక్తలు కొనియాడారు. పౌర
సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రులు రఘువీరా రెడ్డి,
డొక్కా మాణిక్యా ప్రసాద్, కొలుసు పార్ధ సారధి, పాలేటి రామారావు తదితరులు
ములాయం సింగ్ యాదవ్ తో తమకున్న పరిచయాలు, అనుభవాలను నెమరు వేసుకున్నారు.
బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే రానున్న రోజుల్లో రాజ్యాధికారం బి సి లదేనని
పలువురు నేతలు పిలుపునిచ్చారు.
యు పి నుండి ఏ పి వరకూ ములాయం సింగ్ కి ఘనంగా నివాళులర్పించడం చూస్తుంటే ఆయన
తన 60 ఏళ్ల రాజకీయ అనుభవాలు దేశానికి, బి సి సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన
సేవలే ఇందుకు తార్కాణమని రాజకీయ పార్టీకు అతీతంగా పాల్గొన్న అనేక మంది ఆయన
సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా ప్రముఖులు తరలి వచ్చారు.
అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులు ఉప్పుతురి పేరయ్య , రాష్ట్ర అధ్యక్షులు
లాకా వెంగళరావు యాదవ్ , సర్దార్ గౌతు లచ్ఛన్న మనవరాలు గౌతు శిరీష, మాజీ మంత్రి
యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు బత్తుల అర్జునరావు,దండా కృష్ణమూర్తి యాదవ
కార్పొరేషన్ చైర్మన్ హరీష్, ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన
శంకరరావు, సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు ములాయం సింగ్ యాదవ్
కి ఘనంగా నివాళులర్పించారు.