మంచి ఆదాయాన్ని రాబట్టకపోతే ట్విట్టర్ దివాళా తీస్తుందనే ఆందోళన ఎలాన్
మస్క్ కు పెరిగింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు ఆయన తాజాగా తెలియజేశారు. ఈ
విషయం చెప్తూనే ఉద్యోగులకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు పలు ఆదేశాలు జారీ చేశారు.
వారంలో తప్పనిసరిగా 80 గంటలు పని చేయాలని, ఉద్యోగులకు ఆఫీసులో భోజనం ఉండదని,
అలాగే ఇంటి నుంచి పని చేసే సౌకర్యం కూడా ఉండదని తేల్చి చెప్పారు. ఇటీవల
జరిగిన పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ సొంతం
చేసుకున్నారు. అప్పటికే ట్విట్టర్ 10 శాతం నష్టాలతో కొనసాగుతోంది. దీంతో తనదైన
శైలిలో తిరిగి లాభాల్లో పెట్టేందుకు మస్క్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. మస్క్
తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యులేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన
హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావంతో స్టాక్ ఎక్స్చేంజ్ లో
ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల
వల్ల ట్విట్టర్ మరింత దిగజారుతోందని, మస్క్ వైఖరి వల్ల ఉన్నత స్థానాల్లో ఉన్న
ఉద్యోగులు సైతం రాజీనామాలు చేస్తున్నట్లు అనేక విమర్శలు వస్తున్నాయి.