వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కొత్త
సామూహిక పరిమాణాత్మక లక్ష్యం (NCQG) కోసం సహకరించడానికి భారత్, అమెరికా
దేశాలు అంగీకరించాయి. ఈ విషయం శుక్రవారం ఇరు దేశాల ప్రతినిధులు
వెల్లడించారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, భారతదేశ ఆర్థిక శాఖ
మంత్రి నిర్మలా సీతారామన్ సహ-అధ్యక్షతన ఆర్థిక భాగస్వామ్య సమావేశం
జరిగింది. ఈ సమావేశం అనంతరం అమెరికా, భారత్ ఇరు దేశాలు తమ నిర్ణయాలను
సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. “మేము కూడా కొత్త సమిష్టిని చేరుకోవడంలో
కలిసి పనిచేయడానికి అంగీకరిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు,
ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటున్నాము” అని ఇరు దేశాల ప్రతినిధులు
వెల్లడించారు. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్, రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.