పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
జగిత్యాల : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో
అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ
శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం
వెనుగుమట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొప్పుల శ్రీకారం
చుట్టారు. వెనుగుమట్ల గ్రామంలో దాదాపు 4 కోట్ల 25 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి
రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైకుంఠ దామం, కుల సంఘ భవనాలు, బ్రిడ్జి
లను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం
ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం భారీ నీటి పారుదల ప్రాజెక్టు
పూర్తి చేసుకుని 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, అతి తక్కువ
సమయంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసిన రాష్ట్రం కేవలం తెలంగాణ
మాత్రమేనని మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను
అభివృద్ధి బాటలో ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్
,ట్రాక్టర్ స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశామని మంత్రి కొప్పుల
ఈశ్వర్ తెలిపారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత
రాష్ట్రాల్లో గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. హరితహారం
కార్యక్రమంలో ప్రతి సంవత్సరం గ్రామాల్లో వేల మొక్కలు నాటి వాటిని
సంరక్షిస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలో అభివృద్ధి సాధించామని ప్రతి
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలో
డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు రైతుబంధు రైతు బీమా కళ్యాణలక్ష్మీ
వంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ
కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు
పాల్గొన్నారు.