ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో తీవ్ర నిరాశకు లోనైనట్లు కెప్టెన్ రోహిత్ శర్మ
పేర్కొన్నాడు. తాము ఓడిపోవడానికి బౌలర్ల పేలవ ప్రదర్శనే కారణమన్నాడు. మ్యాచ్
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. బ్యాటింగ్
బాగానే చేసినా..బౌలింగ్లో రాణించలేకపోయామన్నాడు. నాకౌట్ మ్యాచ్లలో
ఒత్తిడిని అధిగమించాలని..అయితే ఈ మ్యాచ్లో ఒత్తిడి జయించలేకపోయామన్నాడు.
టీమిండియా ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్లు కొత్తకావన్నాడు. ఆటగాళ్లు ఐపీఎల్లో
ఆడినవాళ్లేనని..వారంతా ఒత్తిడిని జయించినవారేనని తెలిపాడు. ఈ విజయం క్రెడిట్
ఇంగ్లాండ్ ఓపెనర్లకే దక్కుతుందని రోహిత్ శర్మ అన్నాడు. బట్లర్, హేల్స్
అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే దూకుడు
ప్రదర్శించారని మెచ్చుకున్నాడు. అయితే తాము మాత్రం స్థాయికి తగ్గట్లు
ఆడలేదన్నాడు. ముందుగా అనుకున్న ప్లాన్ను సరిగా అమలు చేయలేకపోయామని చెప్పాడు.