బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక
సహాయం
సహాయం
క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు
అమరావతి : తాడేపల్లి గూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం
వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక
చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్యం
అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి
కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా
నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.