ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు
కృష్ణమూర్తి కోరారు. రెవెన్యూ శాఖలోని గ్రామ రెవిన్యూ సహాయకుని స్థాయి నుండి
డిప్యూటీ కలెక్టరు స్థాయి వరకు నవంబర్ 11 వ తేది నుండి 13 వ తేది వరకు (మూడు
రోజులు) గుంటూరు లోని ఆచార్య నాగార్జున యునివర్సిటీలో ఆంధ్రప్రదేశ్
రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ
క్రీడలు, సాంస్కృతిక ఉత్సవములు – 2022 లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
క్రీడా పోటీలు 11వ తేదీ మొదలై 13వ తేదీన పూర్తి అవుతాయన్నారు. ప్రతి రోజు
సాయంత్రం 6 గంటలకు, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ సాయంత్రం సాంస్కృతిక
కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడతాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం క్రీడల్లో
పాల్గొనే వి ఆర్ ఏ
నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగులందరికీ నవంబర్ 10, 11, 14వ
తేదీలలో మూడు రోజులు ప్రత్యేక సెలవు దినాలు గానూ, అలాగే 12, 13 (రెండవ శనివారం
& ఆదివారం) సెలవు దినాల్లో పర్మిషన్ మంజూరు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం
ప్రత్యేక జీవో విడుదల చేసిందని తెలిపారు.*
13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, సిటీ సెంటర్ నుండి 1200 మంది క్రీడాకారులు 10
న ఉదయం 10గంటలకే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి చేరుకుంటారని, 11నుంచి
క్రీడా,సాంస్కృతిక సంబరాలలో పాల్గొంటారని చెప్పారు. 6 వ రాష్ట్ర స్థాయి
రెవిన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవములు– 2022 ప్ర్రారంభ ఉత్సవాలు 11 న
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమీర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్
అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి
ప్రసాద్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమములో ప్రత్యేక అతిథిగా
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్, గౌరవ డిప్యూటీ
కలెక్టరు అయిన కుమారి పీ వీ సింధు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలు,
యూత్ సర్వీసెస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జి.వాణి మోహన్ , ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ , గుంటూరు జిల్లా
కలెక్టరు వేణుగోపాల్ రెడ్డి , బాపట్ల జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ , పల్నాడు
జిల్లా కలెక్టరు ఎల్.శివ శంకర్,గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా
ఉన్నతాధకారులు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారని వెల్లడించారు.
6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు – 2022
ముగింపు ఉత్సవములు తేదీ 13 న ఆదివారం సాయింత్రం 4 గంటల కార్యక్రమానికి ముఖ్య
అతిధులుగా రెవిన్యూ, రిజిస్ట్రెషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరవుతారని,
వారిచే క్రీడలు, సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవము
జరుగుతుందన్నారు. ఈ ముగింపు పండుగలో ప్రత్యేక ఆతిదిగా అంతర్జాతీయ
బ్యాడ్మింటన్ క్రీడాకారులు, డెప్యూటీ కలెక్టర్ కిదాంబి శ్రీకాంత్ విద్యా
శాఖ మంత్రి బొత్స బొత్చ సత్యనారాయణ, పర్యాటక, క్రీడలు శాఖా మంత్రి
ఆర్.కె.రోజా , పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ,
ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నీటిపారుదల శాఖా మంత్రి
అంబటి రాంబాబు , సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున, కుటుంబ
సంక్షేమము, వైద్య విద్యా శాఖా మంత్రి విడదల రజని , ఇంకా అనేక మంది ఉమ్మడి
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, అనేక మంది పెద్దలు
అతిధులుగా హాజరవుతారన్నారు.
ఆలాగే 13 వ తేది ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే క్రీడల ముగింపు సభకు ఉమ్మడి
కృష్ణా, గుంటూరు, పచ్చిమ గోదావరి జిల్లాల లో నుండి గ్రామ రెవిన్యూ సహాయకుని
నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు గల రెవిన్యూ ఉద్యోగులందరూ ముగింపు
కార్యక్రమములో పాల్గొని 6 వ రాష్ట్ర రెవిన్యూ క్రీడల, సాంస్కృతిక ఉత్సవాలని
జయప్రదం చేయాలని కోరారు. 6 వ రాష్ట్ర రెవిన్యూ క్రీడల , సాంస్కృతిక
ఉత్సవములు-2022 నిర్వహణకు అనుమతించి పూర్తి సహాయ , సహకారములు అందించిన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ప్రధాన ఆర్ధిక చేయుతనిచ్చిన రాజ్యసభ సభ్యులు
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి , ఆర్ధిక సహాయ సహకారాలు అందించిన పార్లమెంట్ సభ్యులు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు లకు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు ఆర్థికంగా, వస్తు రూపేణా
సహాయ సహకారాలు అందించిన వివిధ సంస్థలు, వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ
సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో
వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు , ఏ.పి.డెప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం విశ్వేశ్వరనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చేబ్రోలు కృష్ణమూర్తి , రాష్ట్ర కోశాధికారి వీ వీ గిరి కుమార్, రాష్ట్ర
ఉపాధ్యక్షులు రాజేష్ , రాష్ట్ర కార్యదర్శి ఎం మధురి, ఏ. పెంచల రెడ్డి శ్రీ
కోనా ఆంజనేయ కుమార్ (చంటి), సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.