విజయవాడ : విశాఖ ఉక్కు పరిరక్షణకై ర్యాలీ అడ్డుకొని, అఖిలపక్ష కార్మిక సంఘాల
నేతలను అరెస్టు చేయడాన్ని వామపక్ష నేతలు ఖండించారు. 11తేదీన రాష్ట్ర
వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు చేపట్టనున్న నిరసనలను వామపక్షాలు
బలపరిచాయి. స్టీల్ ప్లాంట్ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రధానమంత్రి
మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వామపక్షాల నాయకులు విజయవాడలో ప్రెస్ మీట్
నిర్వహించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీకి అనుమతి ఇచ్చి,
తరువాత అడ్డుకోవడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధానికి సన్మానాలెందుకు అని సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ ప్రజల
మనోభావాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా
ఇవ్వకుండా, రైల్వే జోన్ ఇస్తామని హామీని ఇచ్చి, డివిజన్ ఎత్తేసే దిశగా చర్యలు
చేపట్టారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతికి నిధులివ్వలేదని,
వరదల్లో చిక్కుకొని నిలువునీడ లేక జీవిస్తున్న పోలవరం నిర్వాసితులకు పైసా సాయం
చేయలేదని ఆగ్రహించారు. రాష్ట్రానికే గర్వకారణంగా ఉన్న నిలిచిన విశాఖ స్టీల్
ప్లాంట్ ను ప్రైవేటుకు అమ్మేస్తాం, లేదంటే మూసేస్తాం మోడీ ప్రభుత్వం
చెబుతుందని అన్నారు. 11న పర్యటించనున్న ప్రధానిని ఈ డిమాండ్లపై బహిరంగంగా
ప్రశ్నించి, ఆయన నుండి సమాధానాన్ని రాబట్టాలని ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్
చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వామపక్ష నేతలు తెలిపారు.