విశాఖపట్నం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు,
నిర్వాసితులు విశాఖ నగరంలోని గాజువాకలో ఆందోళనకు దిగారు. 11 ప్రధాని
నరేంద్రమోదీ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ‘ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’
ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేసేందుకు నిర్ణయించారు.
దీనిలో భాగంగా విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీగా
బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య
తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చెందిన
పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాజువాక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుక
శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నామని, దీన్ని పోలీసులు అడ్డుకోవడం
దుర్మార్గమని కార్మికులు మండిపడ్డారు. ప్రాణత్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి
పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించబోమని
తేల్చిచెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.

స్టీల్‌ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ
నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలంటూ స్టీల్‌ప్లాంట్
కార్మికులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్
నుంచి రైల్వే డీఆర్ఎమ్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అలాగే, కార్మికులు
డీఆర్ఎమ్ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర తీశారు.