సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, అభివృద్ధికి అంతే ప్రాధాన్యం
ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు తెలిపారు. 58వ డివిజన్లో రూ.51.65 లక్షల విలువైన అభివృద్ధి పనులకు నగర
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన భూమిపూజ
నిర్వహించారు. అజిత్‌సింగ్ నగర్‌ను మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలనే దృఢ
సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తొలుత మాకినేని
బసవపున్నయ్య స్టేడియంలో రూ. 36.30 లక్షల వ్యయంతో ఇండోర్ షటిల్ కోర్డుకి ఉడెన్
ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా
అధికారులతో కలిసి ఫ్లోరింగ్ నమూనాను పరిశీలించారు. పనులు పూర్తయితే
క్రీడాకారులు రెగ్యులర్ ప్రాక్టీస్ కు ఎంతగానో దోహదపడుతుందని మల్లాది విష్ణు
తెలిపారు. నెల రోజుల్లోగా పనులు పూర్తిచేయవలసిందిగా సిబ్బందికి సూచించారు.
పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం బాలభవన్
ప్రాంగణంలో రూ.15.35 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ భవన
నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
పారిశుద్ధ్యంలో ఇప్పటికే విజయవాడ నగరం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు
సాధించిందిందని మల్లాది విష్ణు అన్నారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో
పారిశుద్ధ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ఈ పనులన్నింటినీ మరుగున పడవేసినందుకు ప్రజలకు
టీడీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్
రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నగరంపై ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున
నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. గత మూడున్నరేళ్ల కాలంలో డివిజన్ లో
రూ. 13.78 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం అన్నారు. వీటిలో
రూ.4.16 కోట్ల పనులు పూర్తి కాగా రూ.5.43 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు
తెలిపారు. మరో రూ.4.17 కోట్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ అరుణ్ కుమార్,
నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, నేరెళ్ల శివ, కాళ్ల ఆదినారాయణ,
ఆర్.ఎస్.నాయుడు, బొందిలి శైలజా, తోపుల వరలక్ష్మి, వీఎంసీ సిబ్బంది, పార్టీ
శ్రేణులు పాల్గొన్నారు.