జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల
11న నిర్వహించే రాష్ట్ర స్థాయి మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా
దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా
పాల్గొని ఉర్దూ భాష పరిరక్షణకు సేవలందించిన ప్రతిభావంతులకు అవార్డులను
అందజేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్
తెలిపారు. ప్రతి ఏటా నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ
విద్యాదినోత్సవాన్ని మరియు రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవంతో పాటు
మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు.
విజయవాడ భవానీపురంలోని ఏపీ ఉర్దూ అకాడమీ కార్యాలయంలో బుధవారం మీడియా
ప్రతినిధులతో చైర్మన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ నదీమ్ అహ్మద్
మాట్లాడుతూ… మైనారిటీ ముస్లిం వర్గాలకు విద్య, వైద్యం అందించడంలో
విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎంతో చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. ఉర్దూ
భాషకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను కల్పించి అధికార భాషగా గుర్తింపు ఇచ్చిన
ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు.నేడు మైనారిటీలలో మహా వృక్షాలుగా ఎదిగిన విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు
స్థాయిలో స్థిరపడడానికి కారణం వై.ఎస్. కుటుంబమేనని కొనియాడారు. గతంలో దివంగత
ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు
కల్పించడం నేడు ఈ ప్రగతికి తార్కాణమని ఆయన తెలిపారు. మైనారిటీ సంక్షేమ
దినోత్సవాన్ని, జాతీయ విద్యాదినోత్సవాన్ని గతంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు,
వైఎస్సార్ కడప జిల్లాల్లో నిర్వహించామని, ఈ ఏడాది గుంటూరులో
నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ రంగంలో ప్రముఖులను సన్మానించడంతో
పాటు వారి సేవలకు గుర్తింపుగా అవార్డులను అందిస్తామన్నారు. మౌలానా అబుల్ కలాం
ఆజాద్ జాతీయ అవార్డు క్రింద లక్షా 25 వేల రూపాయల నగదు బహుమానంతో పాటు మెమెంటో,
ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. డాక్టర్ అబ్దుల్ హక్ రాష్ట్ర అవార్డు క్రింద
లక్ష రూపాయల నగదు బహుమానంతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు.
ఉర్దూభాష పరిరక్షణ, ప్రచారం కోసం పనిచేసిన ఏడుగురికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్
అవార్డు క్రింద ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదు బహుమానం, మెమెంటో,
ప్రశంసాపత్రం అందించనున్నారని తెలిపారు.
‘ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డు’ల క్రింద ప్రతి జిల్లా నుండి ముగ్గురు
చొప్పున మొత్తం 78 మందిని ఉర్దూ మీడియం పాఠశాలల్లో బోధనలో గణనీయమైన కృషి చేసిన
ఎంపిక చేశామన్నారు. ఈ అవార్డు క్రింద 10 వేల రూపాయల నగదు బహుమానం, మొమెంటో,
ప్రసంసాపత్రం అందజేస్తామన్నారు. బెస్ట్ ఉర్దూ స్టూడెంట్స్ అవార్డు క్రింద 78
మంది విద్యార్థులను ఎంపికచేశామని, వీరికి 5 వేల రూపాయల నగదు బహుమానం, మొమెంటో,
ప్రసంసాపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి
కార్యక్రమంతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ
ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు వివిధ పథకాల క్రింద
అవార్డులను అందజేయనున్నామని చైర్మన్ నదీమ్ అహ్మద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఉర్దూ అకాడమీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు షేక్ అబీదా బేగమ్, షేక్ అబ్ధుల్ షుకూర్,
షేక్ ఎం. బాజీ వలీ, సయ్యద్ నూరుల్లా ఖాద్రీ, సెక్రటరీ డా. ఎన్. అయుబ్ హుస్సేన్
తదితరులు పాల్గొన్నారు.