విజయవాడ : 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని,
ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ బద్ధంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి
ఒకే ఒక్క ఆయుధం ఓటుహక్కు అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
బుధవారం పెనమలూరు వీఆర్ సిద్ధార్థా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులచే
నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ ఈసీఐ
కొత్త ఓటర్లను ప్రోత్సహించడానికి వీలుగా 18 సంవత్సరాలు నిండకుండానే 17సం.
దాటిన వారు అక్టోబర్
2023 నాటికి 18 సం.రాలు వచ్చే వారు కూడా ముందుగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు
చేసుకొనే సౌలభ్యం కల్పించిందన్నారు. ప్రతి ఏడాది జరిగే ఓటరు జాబితా సవరణ
కార్యక్రమంలో భాగంగా నేడు
డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశారని తెలిపారు. ఇందులో భాగంగా పోలింగ్ స్టేషన్
వారీగా ఓటరు జాబితాలు ప్రదర్శిస్తారన్నారు. ఓటరుగా ఆన్లైన్లో కూడా సంబంధిత
వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు.
కళాశాలల్లో నమోదు ఫారాలు అందుబాటులో ఉంచుతారన్నారు. మీరు మీతో పాటు మీ తోటి
వారికి కూడా
చెప్పి ఓటరుగా నమోదు కావచ్చన్నారు. ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కాకుండా
ఉండరాదనే, ఓటరు జాబితా సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ఓటరు
నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. ఏరోజుతో మీకు 18 సంవత్సరాలు
నిండుతాయో ఆ తేదీకి ఓటరుగా నమోదవుతారని, మీకు ఓటరు కార్డు (ఎపిక్) జారీ
చేస్తారని, ఇది ఆధార్, డ్రైవింగ్
లైసెన్స్ వంటి వాటితో సమానంగా ఐడీ మాదిరిగా కూడా దీనిని దేశ వ్యాప్తంగా
పరిగణిస్తారని, కావున
అందరూ ఓటరుగా నమోదు కావాలని తెలియజేస్తున్నామన్నారు.
డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఉయ్యూరు ఆర్డీఓ విజయ్ కుమార్, తాడిగడప మున్సిపల్
కమీషనర్
ప్రకాశరావు, పెనమలూరు తహసీల్దార్ భద్రు, ఎంపీడిఓ సునీతాశర్మ, డిఇఓ తహెరా
సుల్తానా, సాంఘిక
సంక్షేమ శాఖ డిడి సరస్వతి, బిసి సంక్షేమశాఖాధికారి లక్ష్మీ దుర్గ
తదితరులు పాల్గొన్నారు.