ఇళ్లు మంజూరు హామీ మేరకు జిల్లాలోఅర్హత గల వారికి తప్పని సరి 90 రోజుల
కార్యక్రమంలో మంజూరు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్
అధికారుల ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో
అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాల కోసం ఎక్కడెక్కడ ల్యాండ్ అవసరం, ఇంకా ఎన్ని
ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి వంటి అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్
జిల్లాలోని పెనుగొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలతో మండల తాసిల్దారులతో, గృహ
నిర్మాణ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య,
సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ
ఇంటి పట్టాలు అందుకున్న లబ్దిదారుల ఏ ఒక్క పట్టాలు రద్దు కారాదని, అర్హత
కలిగి అందిన దరఖాస్తు దారులకు 90 రోజుల్లో పట్టా అందించాలని అన్నారు. సరిపడా
స్థలాలు గుర్తింపు పూర్తి కావాలని అన్నారు. పట్టాలు అందుకుని మరణించి వుంటే
వారి కుటుంబ సభ్యులకు అందించే చర్యలు చేపట్టాలని, అప్పుడే వారికి నమ్మకం
ఏర్పడుతుందని తెలిపారు. గడప గడపకు కార్యక్ర మం లో పట్టా ఇచ్చి జియో టాగింగ్
జరగలేదని, స్థలం చుపలేదనే ఏ ఒక్కరూ అడగకుండా పూర్తి స్థాయిలో చర్యలు
చేపట్టాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక కార్యక్రమం అనేది
గుర్తుపెట్టుకుని పేదలకు ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి
ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర
మున్సిపాలిటీలల లబ్దిదారులకు కేటాయించిన లే ఔట్ల లోని గృహ నిర్మాణాలను
వేగవంతం చేయాలని ప్రతి లే ఔట్ లో రోజుకు కనీసం 50 గృహాల స్టేజ్ కన్వర్షన్లు
జరగాలని అన్నారు.
ఇంటి పట్టాలు అందుకున్న లబ్దిదారుల జియో టాగింగ్ పెండింగ్ లేకుండా పూర్తి
చేయాలని సూచించారు. అలాగే ఇప్పటికే కేటాయించిన పట్టాలలో ఇళ్ళు నిర్మాణానికి
వీలు పడని ప్రదేశం ఉంటే మార్పు లు పూర్తి అయ్యాయని తెలిపారు. వివిధ మండలాలలో
ఇంకా హౌసింగ్ కోసం ఏమైనా ల్యాండ్ అవసరమా వంటి వివరాలను జాయింట్ కలెక్టర్ అడిగి
తెలుసుకున్నారు. అవసరం ఉంటే వెంటనే స్థల సేకరణ చేయాలని తహసీల్దార్ లను
ఆదేశించారు. రీ సర్వేలో ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకుని రావాలని
తెలిపారు. హౌసింగ్ పట్టాలను డౌన్లోడ్ చేసుకుని లబ్ధిదారునికి అందజేసి వాటిని
అప్లోడ్ చేయాలని తాసిల్దారును హెచ్చరించారు. వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న
కేసులకు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని తాసిల్దారును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
బాలాజీ, శ్రీనివాసులు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.