వెల్లివిరుస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 1 వ డివిజన్ 3 వ వార్డు సచివాలయం
పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం నిర్వహించారు. దావు బుచ్చయ్య కాలనీ, ఆదర్శ్ కాలనీ, కార్మిల్ నగర్లో
విస్తృతంగా పర్యటించి.. 167 గడపలను సందర్శించారు. సంక్షేమ పథకాలు అమలు తీరును
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చూడటమే గడప
గడపకు మన ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు
లాగా అబద్దపు వాగ్దానాలతో పేదలను మోసపుచ్చడం తమకు తెలియదని చెప్పారు. అనంతరం
స్థానిక సమస్యలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల
పరిష్కారానికి ఆదేశించారు. అలాగే ఈబీసీ నేస్తం రెండో విడతకు సంబంధించి
అర్హులైన ప్రతిఒక్కరికీ పథకం వర్తించేలా సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు
చొరవ చూపాలన్నారు.
శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సెంట్రల్ నియోజకవర్గాన్ని
అభివృద్ధిలో ముందుంజలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మల్లాది
విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సారిస్తున్నట్లు వెల్లడించారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన
రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి సకల సదుపాయాలను
కల్పించనున్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు సంబంధించి నూతన
రహదారులతో పాటు ఈ ప్రాంతాలన్నింటినీ అనుసంధానిస్తూ మేజర్ డ్రెయిన్
నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
అలాగే గుణదల ఆర్వోబీ స్టేజ్ -2 కి సంబంధించి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని
చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
2024 ఎన్నికలే తెలుగుదేశానికి చివరి ఎన్నికలు
రాష్ట్రంలో వరుస ఘోర పరాజయాలతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో
తెలుగుదేశం నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు అయితే 2019 ఓటమిని ఇప్పటి కూడా
జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో
వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో పురోగతిని చూసి ఓర్వలేక ఏపీ బ్రాండ్
ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి
చేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నారని
దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై పచ్చ నేతలు చేస్తున్న ఆరోపణలు
అర్ధరహితమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళలను కించపరిచే సంస్కృతిని
మానుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. తెలుగుదేశం నాయకులు వైఖరి మార్చుకోకుంటే..
2024 ఎన్నికలే చివరాఖరి ఎన్నికలు కావడం ఖాయమని హెచ్చరించారు. రానున్న
ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరోసారి తిరుగులేని మెజార్టీతో
గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం
ఐదు రోజుల పర్యటనలో తనపై చూపిన ప్రేమానురాగాలకు డివిజన్ ప్రజలకు పేరుపేరున
కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ,
ఏఎంహెచ్ఓ శ్రీదేవి, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల
ప్రసాద్ రెడ్డి, బండి వేణు, యలమంద, ఆర్టీసీ శ్రీను, చంద్రశేఖర్, నాగరాజు,
సువార్త, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.