విశాఖపట్నం : ఈ నెల 12 తేదీన విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల భారీ బహిరంగ విజయవంతం చేయడమే మనందరి లక్ష్యం
కావాలని రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి
పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో బుధవారం మంత్రులు,
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం
నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వివిధ స్థాయిలలోని ప్రజాప్రతినిధులు,
నాయకులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేయాలని
కోరారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలలోని 13 నియోజక వర్గాలకు ఇప్పటికే వాలంటీర్లు
చేరుకున్నారు. వివిధ ప్రాంతాలకు చేరుకొన్న 500 మంది వలంటీర్లు అక్కడి
ఇన్చార్జిలతో, క్షేత్ర స్థాయి నాయకులను సంప్రదించి ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను
బహిరంగ సభకు వాహనాల్లో తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు. ఈ మేరకు
ప్రత్యేకంగా సృష్టించిన యాప్ లో వాహనాల వివరాలు, ఎంతమంది ప్రజలు
తరలివస్తున్నదీ అప్ లోడ్ చేసి కంట్రోల్ రూంకి పంపిస్తారని అన్నారు. కంట్రోల్
రూం నుంచి ఆయా ప్రాంతాల పరిశీలకులకు, ఇన్చార్జిలకు, నియోజకవర్గ ఎమ్యెల్యేలకు
సమాచారం అందుతుందని అన్నారు. ఏ ఏ ప్రాంతాల నుంచి ఎంత మంది వస్తున్నది
ఖచ్చితమైన సమాచారం ఉండాలని అన్నారు. 11తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రధాని
విశాఖకు చేరుకుంటారని రాత్రికి చోళా అతిధి బంగ్లాలో బస చేస్తారని అన్నారు. 12వ
తేదీ ఉదయం ప్రధాని బహిరంగ సభకు చేరుకునే గంట ముందుగానే వివిధ ప్రాంతాల నుంచి
వస్తున్న ప్రజలు బహిరంగ సభకు చేరుకునే చూసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు
దృష్ట్యా వాహనాల్లో వస్తున్న వారికి ఈ విషయం చేరవేయాలని అన్నారు. 3 లక్షల మంది
బహిరంగ సభకు తరలి రావాలన్నది మనందరి లక్ష్యమని ఈ మేరకు శక్తి వంచన లేకుండా
కృషి చేయాలని కోరారు. సుమారు రూ.11 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు
శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన
కల్పించాలని కోరారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వివిధ హోదాలలోని
ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు
సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు,
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, ఎంపీలు ఎంవివి సత్యన్నారాయణ,
సత్యవతి, విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా
వైకాపా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి
శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్
కుమార్, ఎమ్మెల్సీలు వంశీక్రిష్ణయాదవ్, వరుదు కళ్యాణి, రవీంద్రబాబు, తూర్పు
నియోజకవర్గ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త
కేకే రాజు, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త అడారి ఆనంద్, మాజీ మంత్రి బాలరాజు,
ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
అనంతరం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇతర
ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం సర్క్యూట్ హౌస్ ప్రధాని సభ
ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబందించి మంత్రి అమర్ నాథ్, జీవీఎంసీ మేయర్ హరి వెంకట
కుమారితో కలిసి జీవీఎంసీ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏయు ఇంజనీరింగ్
కాలేజ్ గ్రౌండ్ కు వెళ్లి అక్కడ జరుగుతున్న ప్రధాని బహిరంగ సభ
ఏర్పాటు పరిశీలించారు.