అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
కళ్యాణదుర్గంలో జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే
హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గాలు
బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాలు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. పలువురు
సర్దిచెప్పినా ఇరువర్గాల నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా పరస్పరం దాడులు
చేసుకోవడం గమనార్హం. ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. 2014
ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని పక్కన పెట్టి
ఉమామహేశ్వర నాయుడుకు పార్టీ అధినేత చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అప్పటి నుంచి
ఆ నియోజకవర్గంలో రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఆందోళన కార్యక్రమాలైనా
విడివిడిగానే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన సమావేశం
రసాభాస కావడం విశేషం.