అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ నాగలక్ష్మి పై తాడిపత్రి
మున్సిపాలిటీ చైర్మన్, టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి బెదిరింపు ప్రవర్తన,
అవమానకరమైన వ్యాఖ్యలపై అధికారులలో అగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 7
న సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్
నాగలక్ష్మి పట్ల దురుసుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరును
ఇప్పటికే పలువురు ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్
ఐఏఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. అఖిల భారత స్థాయిలో అత్యంత
కఠినమైన, పారదర్శకమైన, విశ్వసనీయ ప్రక్రియ ద్వారా ఎంపికైన ఒక ఐఏఎస్ అధికారి
పబ్లిక్ సర్వెంట్ అని అసోసియేషన్ గుర్తు చేసింది.’ నాగలక్ష్మి బాధ్యతగల,
సమర్థవంతమైన అధికారిగా క్యాడర్లో పేరు పొందారు. ఆమె చర్య, లేదా నిర్ణయానికి
సంబంధించి ఫిర్యాదులుంటే, ఉన్నతాధికారులకు లేదా తగిన సంస్థలకు ఫిర్యాదు
చేయవచ్చు,అంతే తప్ప ఐఏఎస్ అధికారికి లేదా మరే ఇతర ప్రభుత్వోద్యోగికి
వ్యతిరేకంగా బహిరంగంగా వాగ్వాదానికి దిగడం మంచిది కాధు’ అని పేర్కొంది. ఆ
పరిస్థితిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రదర్శించిన సంయమనాన్ని ఆంధ్ర
ప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం అభినందిస్తున్నట్టు తెలిపింది. అలాగే జిల్లా
ఉద్యోగులు తమ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు కృతనిశ్చయంతో మద్దతు
ఇచ్చినందుకు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రశంసించింది. ఒక ఐఏఎస్ అధికారి లేదా
ఏదైనా ప్రభుత్వ సేవకుడితో సంభాషణ సమయంలో సహృదయత అవసరమని అసోసియేషన్
సూచించింది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం
ఎంతైనా వుంది. మరోసారి ఇలా జరగకుండా అయన తన తీరు మార్చుకోవాల్సి వుంది. లేదంటే
ఈ వివాదం మరింత పెరిగే అవకాశముంటుంది.