వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గీత కార్మికుల
కష్టాలు కళ్లతో కాకుండా మనసుతో చూశారని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన
వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. అందుకే బీసీల ఆత్మగౌవరం పెంచేలా, వారికి జీవన
భద్రత కల్పించేలా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. గీత కార్మికుల కోసం కొత్త
పాలసీ తెచ్చి, వారికి భద్రత కల్పించారన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర
కార్యాలయంలో బీసీ ఉప కులాల కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంగళవారం ఆయన
విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ
ఉపకులాలతో పాటు షెడ్యూల్ కులాలు, తెగల వాళ్లు కూడా కల్లు గీత వృత్తి మీద
ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన విధానం మెరుగు పడేలా ఈ నెల 5న జీవో
693 ద్వారా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదవశాత్తు గీత కార్మికులు
మృతి చెందితే, ఆ కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునేందుకు ఎక్స్ గ్రేషియాను
రూ.10 లక్షలకు పెంచారు’ అని చెప్పారు. ఈ గొప్ప నిర్ణయంపై రాష్ట్రంలోని
గీతకార్మిక, ఆ ఉప కులాలన్నీ ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీలు
నిర్వహించి, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నాయని తెలిపారు.