అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత
పాఠశాలను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ సోమవారం
ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరో తరగతి
విద్యార్ధులకు ఇంగ్లీష్ లో పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు
తెలుసుకున్నారు. మన సీఎం వై.యస్.జగనన్న ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పిస్తూ అందిస్తున్న మెరుగైన విద్యా
బోధనపై మంత్రి ఉషాశ్రీచరణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు
పునాదులు పాఠశాలలని, అలాంటి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా
గ్రామీణప్రాంతాలలోని ప్రతి ఒక్క విద్యార్ధికి నేడు చక్కటి విద్యను
అందిస్తున్నామని అన్నారు.
విద్యార్ధుల కోసం విద్యారంగాన్ని ప్రోత్సహించడంలో మన జగనన్న ప్రభుత్వం ఎప్పుడు
ముందుంటుంది అని తెలియజేశారు.