విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్
కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ చేస్తూ కేబినేట్ హోదాను ప్రకటించింది. ఈ సందర్భంగా నవంబర్,
10 వ తేది, ఉదయం 11 గంటలకు, ప్రెస్ అకాడమీ కార్యాలయం, విజయవాడలో ఆయన ప్రెస్
అకాడమీ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ
సమాచార పౌరసంబంధాల, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన
శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్
కుమార్ రెడ్డి తో పాటు కొందరు మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు,
పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని ప్రెస్ అకాడమీ సెక్రటరీ
మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ తెలిపారు.