వి.ఎస్.దివాకర్
విజయవాడ : అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పై జెసి ప్రభాకర్ రెడ్డి
ప్రవర్తన బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర
చైర్మన్ వి.ఎస్.దివాకర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్
రెడ్డి ప్రవర్తించిన తీరు, దౌర్జన్య ప్యూరితంగా వ్యవహరించడం పై ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ జాయింట్ ఆక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ
జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ వి.ఎస్.దివాకర్ అన్నారు. సోమవారం
కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన పై ప్రభుత్వం కఠిన చర్యలు
తీసుకోవాలని కోరారు.
సదరు వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు, ఐఏఎస్ అధికారులకు రక్షణ
లేకపోతే సాధారణ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని,
ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు
ఖచ్చితంగా పోరాటం చేస్తామని అన్నారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి సుగుణ, కో
కన్వీనర్ ఎస్ వెంకటేశ్వరరావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు బి రవీంద్ర
రాజు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు ఎన్ పెద్దన్న, తదితరులు సంఘటనను
తీవ్రంగా ఖండించారు.