విజయవాడ : రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థికంగా వెనుకబడి,
విద్యలో ప్రతిభ కనబరిచిన 87 మంది విద్యార్థులకు 7 లక్షల 52 వేల రూపాయలు
విలువైన ఉపకార వేతనములు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు చేతుల
మీదుగా పంపిణీ చేశారు. ఏలూరు రోడ్ లోని ఐఎంఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాయల్ ట్రస్ట్ సర్వీస్ సేవా కార్యక్రమానికి తన వంతు సహకారం అందించిన సీనియర్
రాజకీయ నాయకులు, ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ చేతుల మీదుగా కొందరికి
ఉపకార వేతనాలు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు బొండాడ గ్రూప్
ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ రాఘవేంద్రరావు, రాయల్
క్లబ్ ఆసోసియేషన్ జాతీయ అధ్యక్షులు సుంకర కృష్ణ , రాయల్ సర్వీస్ ట్రస్ట్
చైర్మన్ పెటేటి పుల్లయ్య, వెస్టిన్ కాలేజ్ డైరెక్టర్ కోటి దుర్గాప్రసాద్,
శివరామకృష్ణ, గుండపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.