ఉచిత విద్యుత్ హామీతో హిమాచల్ ప్రదేశ్లో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ తన
పది పాయింట్ల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్
రాష్ట్రంలో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్లను
లెక్కించనున్నారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను శనివారం సీనియర్
నేత భూపేష్ బఘేల్ సమక్షంలో విడుదల చేసింది.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు…
1. పాత పింఛను పథకం అమలు
2. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
3. యువతకు 5 లక్షల ఉద్యోగాలు
4. యువతకు రూ.680 కోట్ల తో స్టార్టప్ ఫండ్
5. మహిళలకు నెలకు రూ.1,500
6. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
7. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు
8. ప్రతి గ్రామంలో ఉచిత చికిత్స కోసం మొబైల్ క్లినిక్లు
9. ఆవు పేడ కిలో ధర రూ. 2కు కొనుగోలు చేస్తామని హామీ
10. పశువుల పెంపకందారుల నుంచి 10 లీటర్ల పాలకు, వ్యవసాయదారులు వ్యవసాయ
ఉత్పత్తులకు ధర నిర్ణయించే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.