చైనా : తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాని యుద్ధం మరింత తీవ్రతరం చేయవద్దని అణ్వాయుధాలు ఉపయోగించందంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో బీజింగ్ సందర్శించి రష్యా అణ్వయుధ దాడిని వ్యతిరేకించాలని కోరిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో 20వ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జాతీయ కాంగ్రెస్ ముగిసిన తర్వాత చైనా అధ్యక్షుడుని కలిసిన తొలి యూరోపియన్ నాయకుడు స్కోల్జ్. ఆయన బీజింగ్ గ్రేట్ హాల్ ఆప్ పీపుల్‌లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా అణు బెదిరింపును నిరోధించడం, వ్యతిరేకించడం వంటివి చేయాలని జిన్‌పింగ్‌కి చెప్పారు స్కోల్జ్.
ఐతే చైనా ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగడానికి ముందు నుంచి రష్యాతో తమకు హద్దులు లేని స్నేహం ఉందని ప్రకటించడంతో యూరోపియన్‌తో సహా పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధం మొదలయ్యాక కూడా రష్యాకి మద్దతిస్తూ ప్రేరేపించింది యూఎస్ నేతృత్వంలోని నాటో అంటూ నిందించింది చైనా. ఐతే ఇప్పుడూ చైనా తన యూరోపియన్లతో ఉన్న సంబంధాలను తిరిగే పెంపొందించే క్రమంలో అనుహ్యంగా రష్యాకి వ్యతిరేకంగా యూటర్న్ తీసుకుంది.