దేశ రాజధాని, ఎన్సిఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రజల అవయవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. పల్మనరీ మెడిసిన్, స్లీప్ డిజార్డర్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ గులేరియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాయుకాలుష్యంతో జరిగే నష్టాలను వివరించారు. పొగాకు, ధూమపానం కన్నా వాయుకాలుష్యం చాలా ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
” ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన కేటగిరీలో ఉంది. ప్రజల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాల గురించి ఆందోళన చెందడం సహజం. భారతదేశంలో 1.24 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నష్టపోవచ్చు. వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం వారి జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. 2017 అధ్యయనం ప్రకారం ఈ వాయు కాలుష్యం ప్రాణాలను హరిస్తుంద”ని డాక్టర్ గులేరియా వివరించారు.