ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థుల కంటే15 నిమిషాల ముందు రావాలని, పాఠశాల ముగిసిన తర్వాత 30 నిమిషాలు ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల స్థిరమైన ఉనికికి హామీ ఇచ్చేందుకు రాష్ట్రం అవలంబిస్తున్న కఠినమైన వ్యవస్థలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం శుక్రవారం ఈ ప్రకటన చేసింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం… తరగతులు ప్రారంభమయ్యే 15 నిమిషాల ముందుగానే ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకోవాలి. అలాగే పాఠశాల ముగిసిన తర్వాత 30 నిమిషాలు ఉండాలి. అదనంగా, అన్ని సంబంధిత రికార్డులు, రిజిస్టర్లను కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం ఆదిత్య నాథ్ స్పష్టం చేశారు.