7 సార్లు సూపర్ బౌల్ విజేత టామ్ బ్రాడీ, బ్రెజిలియన్ సూపర్ మోడల్ గిసెల్ బుండ్చెన్ శుక్రవారం విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వారు విడాకులు తీసుకోవడం హాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్రాడీ, బుండ్చెన్ తమ విడాకుల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నామని పేర్కొంటూ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ సందేశాలను పంచుకున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం “విచారకరమైనది, సవాలుతో కూడుకున్నది” అని బ్రాడీ పేర్కొన్నాడు. “మేము కలిసి గడిపిన సమయానికి స్నేహపూర్వకంగా కృతజ్ఞతలతో” అంటూ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.