విజయవాడ : విజయవాడలో
స్థానిక 50వ డివిజన్ లోని 176వ సచివాలయం పరిధిలో 129వ రోజు శుక్రవారం గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 176వ సచివాలయంలో పర్యటించడం జరిగిందన్నారు. పార్టీ నాయకులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గడప గడపకు విజయవంతంగా చేస్తున్నామన్నారు. స్థానిక కార్పొరేటర్ డివిజన్ సమస్యల పై పని చెయ్యడన్నారు. ఓటు వేసిన ప్రజలకు న్యాయం చెయ్యలేని వ్యక్తి బోయి సత్యబాబు అని అన్నారు. జనసేన డివిజన్ అధ్యక్షుడు ఇంట్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. జనసేన చెంచాలకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అన్నారు. పాతిన మహేష్ కి కూడా సంక్షేమ పథకం ఇచ్చామన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
చంద్రబాబు కి ఎవరి తో ఒక్కరితో పని చేయించాలి అనే కుతూహంతో పవన్ కళ్యాణ్ పై రెక్కి అని డ్రామాలు అడుతున్నారన్నారు. అసలు ఎమ్మెల్యే గెలవలేని పవన్ కళ్యాణ్ పై రెక్కి నిరభించాలనే ఆలచన మాకు ఎందుకు వుంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు. కె ఏ పాల్ కి వున్న దమ్ము కూడా పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. పవన్ కళ్యాణ్ చీపు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దగ్గర మార్కులు కోసమే ఈ వేషాలు వేస్తున్నారన్నారు. జెడ్ కేటగిరి భద్రత కోసం ఈ వేషాలు వేస్తున్నారన్నారు. ఏపీ పోలీస్ తరుపున భద్రత కల్పిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 50వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బంక విజయ, బంక శివ మిత్రబృందం డివిజన్ నాయకులు కార్యకర్తలు,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ, రెవిన్యు అధికారులు పాల్గొన్నారు.