చైనా కఠినమైన జీరో-కోవిడ్ విధానంలో భాగంగా సందర్శకులను అక్టోబర్ 31న లోపలే వుంచి షాంఘై డిస్నీ తన గేట్లను మూసివేసింది. సందర్శకులు కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపించే వరకు వారిని థీమ్ పార్క్ నుంచి బయటకు అనుమతించబోమని షాంఘై డిస్నీ పార్క్ అధికారులు చెప్పారు. స్థానికంగా సంక్రమించిన 10 కేసులను షాంఘై నివేదించిన తర్వాత ఇలా చేయడం విశేషం. చైనా వివాదాస్పద జీరో-కోవిడ్ విధానం ఇప్పటికే లక్షలాది మందిని ఇబ్బందులకు గురి చేసింది. పదే పదే లాక్ డౌన్, కొన్నిసార్లు అసాధారణ ప్రదేశాల్లో వుండిపోవాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, షాంఘై డిస్నీలో తమ స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక సానుకూలతతో తమను తాము ఓదార్చుకోవచ్చు. ‘ది హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్’లో చిక్కుకున్న వారి కోసం కోవిడ్ పరీక్షలు కొనసాగుతున్నాయని నివేదించింది.