న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 30వతేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంపై జరిగిన దాడి, విధ్వంసంపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది.సీఎం నివాసం వద్ద భద్రత కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారని ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సంజయ్ జైన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి భద్రత పెంచామని, సివిల్‌లైన్స్ మెట్రో స్టేషన్లో ఇప్పుడు ఎలాంటి నిరసనలను అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు గతంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ ఘటన జరిగి ఉండకూడదని కోర్టుకు చెప్పారు. సీఎం భద్రతపై సమీక్షించామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటి వెలుపల విధ్వంస ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసు స్టేటస్ రిపోర్ట్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.