బెంగళూరు : తుంగభద్ర జలాలు ఎట్టకేలకు ఎల్లెల్సీకి విడుదలయ్యాయి. బళ్లారి రూరల్ పరిధిలోని మోకా సమీపంలోని భైరదేవనహళ్లి గ్రామంలో వేదావతి నదిపై నిర్మించిన కాలువకు సంబంధించి 16వ నెంబర్ పిల్లర్ విరిగిపోవడంతో 15 రోజులుగా కాలువలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. రెండు రోజులుగా మంత్రి శ్రీరాములు, రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర రెండు రోజుల పాటు అక్కడే బసచేసి అధికారులతో చర్చించి ఎల్లెల్సీ ఫిల్లర్ మరమ్మతు పనులు వేగవంతం చేయించారు. ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రి ప నులు పూర్తి కావడంతో నూతనంగా నిర్మించిన ఫిల్లర్కు మంత్రి శ్రీరాములు, ఎమ్మెల్యే నాగేంద్రలు పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 12 గంటల తర్వాత ఎల్లెల్సీ కాలువలో నీటిని విడుదల చేశారు. దీంతో క ర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు రైతు సంఘం నాయకులు పురుషోత్తమ్ గౌడ, ఇంజనీర్లు పనులు వేగవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారు.