న్యూఢిల్లీ : రక్షణ శాఖ ఆధీనంలోని సైన్యానికి చెందిన భూములను ఆక్రమించుకొని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు,మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో శుక్రవారం దాడులు చేసింది. రక్షణ శాఖ భూములను ఆక్రమించుకొని దుర్వినియోగం చేశారని పలు ప్రాంతాల్లో సంస్థలపై ఈడీ సోదాలు సాగిస్తోంది. దీంతోపాటు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్, నోఖా ప్రాంతాల్లోని 40 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బికనేర్ నగరంలోని తయాల్ గ్రూప్, రాఠీ గ్రూప్, ఝావర్ గ్రూప్ ప్రాంగణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఎస్ఆర్ఎస్ గ్రూప్ కంపెనీల ఛైర్మన్ తోపాటు 19 మంది నిందితులపై ఐటీ ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. గతంలో ఈడీ 2,045 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.