ఉక్రెయిన్పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందనే వార్తలు ఇటీవల సంచలనం రేపాయి. మరోవైపు ఉక్రెయిన్ దేశమే తమపై అణు దాడి చేయడానికి సిద్ధమైందని రష్యా ఆరోపించింది. ఐరోపాలోని అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! ఈ తరుణంలో రష్యా సైనిక కమాండర్లు అణ్వాయుధాల గురించి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్లో మాస్కో వ్యూహాత్మక అణ్వాయుధ దాడికి ఎప్పుడు, ఎలా మోహరించాలనే దానిపై రష్యా సీనియర్ సైనిక అధికారులు ఇటీవల చర్చించారు. అయితే, ఈ చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకాలేదు.