చైనా పర్యటన సమయంలో జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బీజింగ్‌కు ఎలాంటి సంకేతాలు ఇస్తారనే ప్రశ్నలు స్వదేశంలోనే తలెత్తాయని యూరోపియన్ పార్లమెంట్‌లోని ఓ జర్మన్ సభ్యుడు అన్నారు. పాలక కూటమిలో భాగమైన గ్రీన్ పార్టీకి చెందిన రీన్హార్డ్ బుటికోఫెర్ తైవాన్‌లో మాట్లాడారు. “బహుశా 50 సంవత్సరాలుగా దేశంలో అత్యంత వివాదాస్పదంగా చర్చనీయాంశమైన పర్యటన.” అని బుటికోఫెర్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జర్మనీ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత కూడా చైనాను సందర్శిస్తున్న మొదటి యూరోపియన్ దేశాధినేత స్కోల్జ్. శుక్రవారం ఆయన బీజింగ్‌కు వెళ్లనున్నారు. దౌత్యపరంగా మాస్కోకు బీజింగ్ మద్దతు ఇచ్చిన తరుణంలో ఈ పర్యటన వివాదంగా మారి.. ప్రాధాన్యం సంతరించుకుంది.